ఒక దుంప ఒక నిషేధం

11:03 ఉద. వద్ద 23/03/2010 | Uncategorized లో రాసారు | 2 వ్యాఖ్యలు

ప్రజలకు శుభవార్త.త్వరలో కూరగాయల ధరలు ఆకాశానికంటి ఆదివారం కూడా బంగాళాదుంప ముక్క ముట్ట లేని పరిస్థితి రానుంది. కారణం కర్నాటక లో ప్రభుత్వం బంగాళదుంప పైన బ్యాన్ విధించింది. ప్రభుత్వం లోని నియో హిందుత్వ భావజాలం కలిగిన పెద్దలు ప్రజల ప్రధాన ఆహారం అయిన బంగాళదుంపను నిషేధించి ప్రజల నడ్డి విరిచారు. నిజానికి Prevention of Potato Act ప్రయోజనకరం గానే ఉంది. బంగాళదుంప దొరకకపోతే ఎవరు తినరు అన్న చిన్న లాజిక్ ఎందుకు పెద్దలు మిస్ అయ్యారో అర్థం కావటం లేదు. బంగాళదుంప ను నిషేధించడం ద్వారా హిందుత్వ అజెండా తెర పైకి తెచ్చారు. ఇంత కంటే ముర్ఖవాదం ఇంకోటి ఉండదు. ఈ సందర్భంగా నా స్నేహితుడు రాసిన ఒక కవిత ,

బంగాళదుంప బంగాళదుంప
బొడ్డుడినప్పటి  నుంచి తిన్న దుంప
రక్తంలో భాగమైన దుంప
అన్నంలోకి , చపాతిలోకి కలుపుకున్న దుంప

నువ్వు స్ట్రాబెర్రి, చెర్రి
తిన్నాను అని గొప్పలు చెప్పుకున్నప్పుడు
నా తరపున నిలబడ్డది
నాతో ఉన్నది – నాలో భాగమైనది
ఉర్లగడ్డ @ బంగాళాదుంప

నా ఆకలి తీర్చిన దుంపను
నిషేధించావు నువ్వు
వస్తున్నా ఉండు
నీ దుంప తెంచుతా

కొన్ని ఉపయుక్తం అయిన లింక్ లు

http://www.carbohydrate-counter.org/veg/search.php?cat=Potato&fg=1100

http://www.mvproduce.com/spudfacts.html

2 వ్యాఖ్యలు »

RSS feed for comments on this post. TrackBack URI

  1. నువ్వు స్ట్రాబెర్రి, చెర్రి
    తిన్నాను అని గొప్పలు చెప్పుకున్నప్పుడు
    నా తరపున నిలబడ్డది
    నాతో ఉన్నది – నాలో భాగమైనది
    ఉర్లగడ్డ @ బంగాళాదుంప

    Well Said. వాడొక వెర్రి వెంగళప్ప. ఆ చిడతల చిన్నారావు కి చెక్క భజన గులాబి, మళ్ళి వీళ్లు నవతరంగం లో గుసగుసలు మొదలు పెట్టారు.

  2. baagundi


వ్యాఖ్యానించండి

వర్డ్‌ప్రెస్.కామ్‌లో బ్లాగండి.
Entries మరియు వ్యాఖ్యలు feeds.