ఇదే నైజం అదే వాదం

11:59 సా. వద్ద 07/09/2010 | Uncategorized లో రాసారు | 1 వ్యాఖ్య

అనునిత్యం కుళ్ళు
క్షణక్షణం పెరుగుతున్న దురద
ప్రతి రోజు వితండవాదం
అన్ని రాతలలో  ఇదే తంతు
అప్పటికి ఇప్పటికి ఇక ఎప్పటికి ఇదే వంతు

తెలిసింది ఒకటే
అదే ద్వేషించడం
తెలియనిది ఒకటే
అదే ప్రపంచం
తలలో మెదడు ఉంటే   ఇలా జరిగేదా

విషం కక్కడం  రంగు మార్చడం
ఆకాశం పై ఉమ్మాను అనుకోడం
బురదలో పొర్లాడడం
ఇదే నైజం అదే వాదం

ఉమ్మించుకుంటే ఎలా ఉంటుంది !!!

9:26 సా. వద్ద 18/05/2010 | Uncategorized లో రాసారు | 1 వ్యాఖ్య

నా రాతలతో బరువెక్కిన బ్లాగు
మురుగు నీరు కాలువలో
వెళ్లినట్టు అచ్చంగా ….
అర్కేమేడిస్ సూత్రాన్ని అనుసరించింది

మొహాన ఉమ్మినప్పుడు
తుడుచుకున్నానే గాని
ప్రతి చర్యగా ఉమ్మ లేదు
న్యూటన్ సూత్రం తప్పిందా
లేక …
ఉమ్మడానికి మొహం
దొరకలేదా ???

చెత్త తో పేరుకున్న మెదడు
ఉమ్మించుకోమంది
కాస్త దురద తగ్గించుకుందాం
అంటే …
ఇచ్ గార్డ్ దొరకలేదు

నా కడుపు మంటలు ఎగిసాయి
వాటిని చల్లార్చు కోవటానికి
బ్లాగు రాతలు మొదలయ్యాయి
నగ్నంగా నర్తిస్తూ
నాపై నేను ఉమ్ముకుంటూ
కూర్చున్నాను

అప్పుడు తెలిసింది
నా ఉమ్ము , నా రాతలు రెండు
మురుగు కన్నా ఎంత కంపో …

పెరుగుతున్న కుతి

3:48 సా. వద్ద 14/05/2010 | Uncategorized లో రాసారు | 4 వ్యాఖ్యలు

అన్ని వాదాలతో పాటు ఇప్పుడు దురదవాదం కూడా పెరుగుతోంది.

దురద పెడితే గోక్కోవడం ఒక పద్దతి. పక్కనోడికి దురదపెడితే మనం గోక్కోవడం లేదా మనకు దురద పెడితే పక్కనోడిని గోకడం తద్వారా కుతి తీర్చుకోవటం అనేది ఈ మధ్యలో సాధారణంగా జరుగుతోంది.

దురద మారుతూనే ఉంటుంది . అలాగే అనేక రకాలుగా కూడా ఉంటుంది. ఆటవికమైన దురద, అనాగరికమైన దురద మొదలైనవి. ఈ దురదలలో ఒక కాంక్ష ఉంది. ఈ దురదలలో ఒక Empirical evidance ఉంది. కుతి, దురద అనేవి Mathematical Equations కావు.

దురద ఎక్కువై గోకుతూనే ఉంటె అది పుండుగా మారుతుంది. ఇది violence కి దారి తీస్తుంది. దీనికి ఒకే ఒక solutions ఉంది అదే counter violence.

మూర్ఖత్వం చట్ట వ్యతిరేకం కాదు

4:35 సా. వద్ద 25/03/2010 | Uncategorized లో రాసారు | 6 వ్యాఖ్యలు

మూర్ఖత్వం చట్టవ్యతిరేఖం కాదు. కుతి తీర్చుకోవడం, విషం చిమ్మడం మొదలైనవి మూర్ఖత్వం యొక్క
ప్రాధమిక లక్షణాలు. మూర్కత్వమ్, చట్టం అనేవి రెండు భిన్నమైన విషయాలు. హిందూ సాంప్రదాయం పై, పురాణాలపై హేట్ వాదం పేరిట బురద చల్లడం అనేది రాజ్యాంగం కలిపించిన హక్కు. ఈ సందర్భంగా నేను చేసిన కొన్ని వ్యాఖ్యలు.

1. ప్రతి మూర్ఖుడు మూర్ఖత్వం తో కూడిన టపాలు , సమీక్షలు , వ్యాఖ్యలు చేయవచ్చు. ఒక వేళ అది మీకు నచ్చక పొతే లేదా మీ మనోభావాలు గాయపడితే అది మీ సమస్య. అంతే కాని మూర్ఖుడికి ఏమాత్రం బాద్యత లేదు. కాని మీరు వ్యతిరేఖంగా మాట్లాడితే మూర్ఖుడి మనోభావాలు గాయ పరిచారు అన్న నేరం పై మీ మీద చర్య తీసుకువచ్చు.

2. Section 125 of  Moron Procedure code  లో జరిగిన మార్పుల దృష్ట్యా మీరు ఏ మాత్రం confusion కావలసిన అవసరం లేదు. మూర్ఖుడు ఏమైనా  చెయ్యవచ్చు. అది తప్పు అనే నైతికత మీకు లేదు.

3. Lunacy Act  ప్రకారం మూర్ఖుడు హేట్ వాదం ముసుగులో విషం చిమ్మ వచ్చు. దాన్ని వ్యతిరేఖించే హక్కు మీకు లేదు. కాదు,  కూడదు అంటే మీ పై వ్యవస్థీకృత శోధన చట్టం ప్రకారం చర్య తీసుకోవచ్చు. కుతి తీర్చుకోవడం అనేది వ్యక్తిత్వం లోని ద్రుడత్వాన్ని తెలియచేస్తుంది. దాన్ని వ్యతిరేఖించడం అనేది వ్యక్తిత్వం లోని బలహీనతను తెలియచేస్తుంది.

4. బొమ్మలకు బట్టలువేసి  చూడడం అనేది భావ దారిద్రాన్ని సూచిస్తుంది. ఆడ మొగ తేడ లేకుండా బట్టలుడ దీసి చూడడం అనేది భావ వైశాల్యాన్ని చూపుతుంది.

5.మూర్ఖత్వం , హేట్ వాదం పరస్పర అవినాభావ సంబంధం కలిగి ఉన్నాయి. వీటిని సులువుగా వ్యక్తం చేయగల ఈ కాలం లో They surely chose one over other. They also have a right to switch between these fucktards.

ఒక దుంప ఒక నిషేధం

11:03 ఉద. వద్ద 23/03/2010 | Uncategorized లో రాసారు | 2 వ్యాఖ్యలు

ప్రజలకు శుభవార్త.త్వరలో కూరగాయల ధరలు ఆకాశానికంటి ఆదివారం కూడా బంగాళాదుంప ముక్క ముట్ట లేని పరిస్థితి రానుంది. కారణం కర్నాటక లో ప్రభుత్వం బంగాళదుంప పైన బ్యాన్ విధించింది. ప్రభుత్వం లోని నియో హిందుత్వ భావజాలం కలిగిన పెద్దలు ప్రజల ప్రధాన ఆహారం అయిన బంగాళదుంపను నిషేధించి ప్రజల నడ్డి విరిచారు. నిజానికి Prevention of Potato Act ప్రయోజనకరం గానే ఉంది. బంగాళదుంప దొరకకపోతే ఎవరు తినరు అన్న చిన్న లాజిక్ ఎందుకు పెద్దలు మిస్ అయ్యారో అర్థం కావటం లేదు. బంగాళదుంప ను నిషేధించడం ద్వారా హిందుత్వ అజెండా తెర పైకి తెచ్చారు. ఇంత కంటే ముర్ఖవాదం ఇంకోటి ఉండదు. ఈ సందర్భంగా నా స్నేహితుడు రాసిన ఒక కవిత ,

బంగాళదుంప బంగాళదుంప
బొడ్డుడినప్పటి  నుంచి తిన్న దుంప
రక్తంలో భాగమైన దుంప
అన్నంలోకి , చపాతిలోకి కలుపుకున్న దుంప

నువ్వు స్ట్రాబెర్రి, చెర్రి
తిన్నాను అని గొప్పలు చెప్పుకున్నప్పుడు
నా తరపున నిలబడ్డది
నాతో ఉన్నది – నాలో భాగమైనది
ఉర్లగడ్డ @ బంగాళాదుంప

నా ఆకలి తీర్చిన దుంపను
నిషేధించావు నువ్వు
వస్తున్నా ఉండు
నీ దుంప తెంచుతా

కొన్ని ఉపయుక్తం అయిన లింక్ లు

http://www.carbohydrate-counter.org/veg/search.php?cat=Potato&fg=1100

http://www.mvproduce.com/spudfacts.html

బ్లాగుల్లో విశాల భావాలు

3:22 సా. వద్ద 17/03/2010 | Uncategorized లో రాసారు | 3 వ్యాఖ్యలు

ఈ మధ్య నా స్నేహితుడితో  సంప్రదాయం, ఆధునికత పైన చర్చిస్తూ ఇటివల నేను రాసిన టపాలు చూపించాను. అది చదివిన నా స్నేహితుడు ఏంటి కుతి, దురద, దుమ్మెత్తి పోయడం, విషం చిమ్మడం ఇవన్ని నీ భావజాలమా అని ప్రశ్నించాడు. నేను టక్కున భుజాలు తడుముకొని ఈ విధంగా సమాధానం ఇచ్చాను. ఆ సమాధానం ఏంటి అంటే …

“దురద, దుమ్మెత్తి పోయడం, విషం చిమ్మడం ఇవన్ని కుడా వేరు వేరు ఎలా అవుతాయి. నిత్యం నాలో తొణికిసలాడే భావాలు అవి. కాకపోతే ఒకొక్కటి alternative vision ఇస్తుంది.  ఈ బ్లాగ్లోకం లో ఎవరి ఇష్టం వారిది. కాని అందరు నా ఇష్టాన్ని సరైనది అనాలి. లేదు అంటే వాళ్లదంతా మూర్ఖత్వం. నేను నా వంతుగా బ్లాగ్లోకాన్ని సంస్కరించడానికి నాదైన శైలి లో ప్రయత్నిస్తాను. నేను చెప్పేదానికి సై అన్న వాళ్ళు అంతా శంకరాభరణం శంకర శాస్త్రులు, కాదు … కూడదు అన్నవాళ్ళని  టింకర శాస్త్రులు అని ఎద్దేవా చెయ్యడానికి నేను వెనుకాడను. కొంత మంది బ్లాగ్లోకం లో నా లాగ  విలువల్ని, వలువల్ని తాకట్టు పెట్టి టపాలు రాయలేరు. వీరిది అంతా కూడా ఫాసిజం. వీళ్ళు ఎప్పుడు ఒక వర్గాన్ని అనగాదోక్కాలి అని ప్రయత్నిస్తుంటారు. ఈ నియో సంప్రదాయ వాదులు అసలైన ద్రోహులు. వీళ్ళకి ప్రపంచతత్వం అన్న చింతన లేదు. కాశ్మీర్ ను పాకిస్తాన్ కు ఇవ్వాలి అన్న , అరుణాచల్ ను చైనా కి ఇవ్వాలి అన్న Global thoughts అసలు లేవు నాకు వీళ్ళతోనే problem. దావూద్ , బిన్ లాడెన్, కసాబ్ లాంటి వాళ్ళను ప్రోత్సహించాలి అన్న కాంక్ష లేదు. వీరిది అంతా  blind belief in glory”.

ఇదంతా విన్న నా స్నేహితుడు నా వైపు అదోలా చూస్తూ వెళ్ళిపోయాడు.

నరకపు అంచులలో నా నృత్యం

1:59 సా. వద్ద 13/03/2010 | Uncategorized లో రాసారు | 2 వ్యాఖ్యలు

నా  మనసులోని కుతి బయటకొచ్చి
టపా రూపం సంతరించుకున్నప్పుడు
కలకలం చెలరేగుతుంది.
నా అసలు రూపం బయటపడుతుంది.

ఒక్కోసారి నా రాతల్లో జుగుప్స అందరికి విరక్తి కలిగిస్తుంది
నా లో నిద్రాణమైన అరాచకత్వం కొత్త పుంతలు తొక్కుతుంది.
అప్పుడే నేను విషం చిమ్ముతూ , పొగలు కక్కుతూ కరాళ నృత్యం చేస్తాను.

ఒక హక్కు- కొన్ని కుట్రలు

11:51 ఉద. వద్ద 12/03/2010 | Uncategorized లో రాసారు | 3 వ్యాఖ్యలు

నిన్న ఒక స్నేహితుడితో  బ్లాగులు – పోరాటాలు -కుట్రలు – కవితలు అన్న విషయం పై చర్చ జరిగింది. ఆ విషయాలు…

హక్కుల కోసం పోరాడాలి అంటే మనం బాధితులు కానవసరం లేదు. పీడితులు కానవసరం అంతకన్నా లేదు. కాంట్రవర్శిలు చెయ్యగలిగితే చాలు. వివాదాలు సృష్టించ గలిగితే చాలు. నందిని పంది, పంది ని నంది అనగలిగితే చాలు. ఎడ్డెం అంటే తెడ్డెం అనగలిగితే చాలు. ఎందుకు అంటే వివాదాలు సృష్టించక పొతే మనకు సాటి,  మేటి బ్లాగరు, మేధావి అన్న పేరు రాదు. మనము ఒక సామాన్య బ్లాగరు గా మిగిలిపోతాం. ఇది “Struggle for existence in the blog world” అన్న మాట.

మన బ్లాగుల్లో తెలివైన వాళ్ళు ఉన్నప్పటికీ చెవిలో పువ్వు పెట్టు కున్న వాళ్ళు కొందరున్నారు.  2008-2009 లెక్కల ప్రకారం మొత్తం బ్లాగరులు 99,999 అందులో తెలుగు బ్లాగరులు 11,11,111. మళ్ళి ఇందులో చెవిలో పూలు పెట్టు కున్న వాళ్ళు 22,22,222. మనం ఈ చెవి లో పూలు పెట్టు కున్న వాళ్ళని టార్గెట్ చెయ్యాలి. మిగిలిన వాళ్ళు తెలివైన వాళ్ళు. మీకు కుడికలు తీసివేతలు తెలుసు అంటే మనం మనం gtalk లో వొద్దు లెండి yahoo లో మాట్లాడుకుందాం.

బ్లాగు రాజ్యం లో బ్లాగోద్యమానికి ఉన్న ప్రాదాన్యత చాలా ఎక్కువ. కొంత మంది ఒక తరగతి ప్రజలను మరో 50 సంవత్సరాల వరకు బ్లాగులోకం లో అడుగు పెట్టకుండా చెయ్యడానికి ప్రయత్నిస్తుంటారు. అందుకే వీళ్ళు emotional rhetoric గా మాట్లాడుతారు. వీళ్ళు మనల్ని ప్రశ్నిస్తూ ఉంటారు. మనం వీళ్ళకు ఒకటే చెప్పాలి  You mean nothing to me. ఇదే వ్యాక్యను మనం ముందుకు వెనక్కు మార్చి చెప్పేయాలి. ఈ సందర్భంగా నా స్నేహితుడు చెప్పిన కవిత

నేను రాసిన కామెంటు
నన్నే మూర్ఖుడు అంది
అప్పుడు గుర్తొచ్చింది
నిన్న ఒక బ్లాగరు అన్న మాట
“నువ్వెంత తెలివైన వాడివి”  అని

బ్లాగరు బాధ్యత

6:53 ఉద. వద్ద 11/03/2010 | Uncategorized లో రాసారు | 5 వ్యాఖ్యలు

నిన్న నా స్నేహితుడి తో బ్లాగరు బాధ్యత గురించి చర్చించడం జరిగింది. తన అభిప్రాయం ప్రకారం…

బ్లాగడం అనేది సాహిత్య సృజన కన్నా ఎప్పుడు ఒక మెట్టు పైనే  ఉంటుంది.  ఎందుకు అంటే రాయడం కన్నా బ్లాగడం ఉన్నతం కాబట్టి. అది ఎలాంటిది అయిన ముందు, వెనుక , పైన , కింద చూసుకోకుండా బ్లాగాలి అంటే మాటలా చెప్పండి. Blogging is like having wine.  అంటే బ్లాగును అడ్డం పెట్టుకొని మన కుతి, దురద అన్ని తీర్చుకోవాలి అని అర్థం. మీకు నా ఇంగ్లీష్, నాకు మీ తెలుగు తెలుసు అనుకుంటే మనం మనం gtalk లో మాట్లాడుకుందాం.

మనం సృష్టించే టపాలలో  సామాజిక ప్రయోజనాన్ని అందరు గుర్తించే విధంగా చెయ్యాలి. ఆ విధంగా చెయ్యాలి అంటే మన టపాకు మంచి కామెంట్లు రాయాలి. బ్లాగు , కామెంటు సంగమించి ఒక మంచి టపాకు ప్రాణం పోస్తాయి .  కామెంట్లు రాసేది మనమే కుడా కావచ్చు.  కామెంటేప్పుడు తర్కానికి , విమర్శకు స్థానం లేదు. కొన్నింటిలో మనల్ని మనమే తిట్టుకోవాలి. అది చూసి మిగిలిన వాళ్ళకు మన మీద జాలి కలగాలి.  అటువంటి వాటినే మనం కామెంట్లు గా ప్రచురించు కోవాలి.  కొన్నింటిలో పోగుడుకోవాలి. ఈ పొగడ్త మన బ్లాగుకు ప్రాణం లాంటిది. హేతువాదులకు హేట్ ఎంత ముఖ్యమో అలా అన్న మాట. ఈ పొగడ్తలు రాసేవాళ్ళు  తర్కాన్ని , విమర్శను పక్కన పెట్టి మనం రాసే చెత్తకి , సుత్తికి  కుడా మనల్ని పొగుడుతూ కామెంట్స్ రాస్తుంటారు. వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాన్ని  కూడా  పక్కన పెట్టి మనకు బ్లాగోజనక ప్రయోజనాన్ని కలిగించాలి అనే ఏకైక లక్ష్యం తో ముందుకు సాగుతూ కామెంటుతు ఉంటారు. To give a good pep talk they need ideas.  వాళ్ళ నుంచి మంచి మంచి పొగడ్తలు కామెంట్లు గా రావాలి అంటే  మనమే వాళ్ళకు ఆ అవకాశాన్ని కల్పించాలి. వైవిధ్య భరితమైన టపాలు రాయాలి.  ఉదాహరణకు …

1.  నూతిలో కప్పకు చేతిలో చిప్పకు సంబంధం పెట్టి టపా రాయాలి.

2.  పాకిస్తాన్ లో బాంబ్ పేలింది అంటే దానికి “హిందు”స్తాన్ కారణం అని రాయాలి.

3. ఎద్దు ఈనిందా అంటే ఇంకేం పాలు పితికేయ్ అన్నట్టు రాయాలి

4.  నేను తుమ్మిందానికి కారణం వందల సంవత్సరాలుగా జరుగుతున్నా అరాచకం, అణచివేత అని రాయాలి

5. చెత్త, చెత్త వాదం, చేత్తోన్మాదం అని టపా రాయాలి. అందులో కాశ్మీర్ ను పాకిస్తాన్ కు ఇచ్చేయాలి    అనాలి

6. ఏది పుణ్యం అని టపా రాయాలి అందులో జాంగ్రి ఎలా చేస్తారు అని చర్చించాలి.

ఒక వేళ ఎవడు అయిన ఏంటి ఇలా రాసావు అన్నాడే అనుకో నా బ్లాగు నా ఇష్టం నీకేం కష్టం అనాలి.

ఇవి ఒక బ్లాగరు బాద్యతలు మరి కొన్ని ఇంకో టపాలో …

బ్లాగు రాతలు

5:27 ఉద. వద్ద 10/03/2010 | Uncategorized లో రాసారు | 6 వ్యాఖ్యలు

నేను ఒక బ్లాగు రాయాలి అనుకుంటున్నాను నీ సలహా ఏంటి  అని ఒక స్నేహితుడిని అడిగాను. దానికి తను కొన్ని సూచనలు , సలహాలు ఇచ్చాడు అవి …

మనం మొదట కొన్ని కవితలు , కథలు రాయాలి (కాపి అయితే ఇంకా మంచిది) దాంతో కొంత మంది చుట్టుతా చేరుతారు. తరువాత మన విశ్వరూపం చూపించాలి. అబ్బో విశ్వ రూపం ఈ పదం మతోన్మాదం తో కూడుకున్నది ఈ పదం వాడవద్దు. ఇది వాడావు అనుకో నీకు లౌకికవాది అన్న బిరుదు రాదు.
ఇక మన మూర్ఖవాదం మొదలు పెట్టాలి. ఎడా పెడా టపాలు రాయాలి. ఊరిది ఒక దారి అంటే ఉలిపిరి కట్టది ఒక దారి అన్నట్టు రాయాలి. అప్పుడే మన నేము , ఫేము పెరుగుతాయి. ఎవడు అయిన కాదు అన్నాడా అంతే… నువ్వు మూర్ఖుడు , మీ తాత మూర్ఖుడు , మీ పూర్వికులు మూర్ఖులు అని రాయాలి. ఇంకా వీలైతే మీ పక్కింటి వాళ్ళు , మీ ఎదురింటి వాళ్ళు , మీ పక్కింటికి ఎదురింటి వాళ్ళు , మీ ఎదురింటికి పక్కింటి వాళ్ళు , మీ వెనకింటి వాళ్ళు, మీ ఇంటి ఓనరు (సొంత ఇల్లు అయితే ఇల్లు కట్టినవాడు ) అందరు మూర్ఖులు అనాలి. తరువాత పోయి రెండో తరగతి పరిసరాల విజ్ఞానం చదువుకొని రా అనాలి. అప్పుడప్పుడు మాడ్రానిజం గురించి మాట్లాడాలి.  ఎక్కడ అయిన మనకు భారత దేశం అన్న పదం కనపడితే  వెంటనే అక్కడకు వెళ్లి పాకిస్తాన్ అనాలి .  ఎవరు అయిన భాద  పడితే మనం నవ్వాలి.  మనం భాద  పడేటప్పుడు ఎవడు అయినా నవ్వాడో … ఇక చూసుకో  కేసు వేస్తా అనాలి.

నాకు  తెలిసిందే లోకం అనాలి.  మనకు తెలియనిది ఎవడు అయినా చెప్పాడే అనుకో హ హ  భలే జోకులేస్తారే మీరు అనాలి. అంతే కాని దానికి సమాధానం ఇవ్వకూడదు. ఎందుకంటే అది మనకు తెలిదు కనుక. ఇంకో విషయం ఎవడు అయిన గట్టిగా వాదిస్తుంటే ఏమి చెయ్యాలంటే  ఒక నాలుగు లింకులు ఇచ్చి ఇవి చదువు ముందు అనాలి.  అందులో ఏముందో మనకు తెలిదు అది వేరే విషయం.
ఏదో మనం అది చదివాము అనుకుంటాడు వాడు .  మనం ఇలా ఎస్కేప్ అవ్వాలి.  చూసే వాళ్ళు అబ్బో  భలే మేధావి అనుకుంటారు.

సందు దొరికితే చాలు మనం పోయి చిందు వేసేయ్యాలి.    (ఇంకా ఉంది  )…..

తర్వాత పేజీ »

వర్డ్‌ప్రెస్.కామ్‌లో ఓ ఉచిత వెబ్‌సైటు లేదా బ్లాగును సృష్టించుకోండి.
Entries మరియు వ్యాఖ్యలు feeds.